Kanipakam: నింగికెగసిన ఆకాశ దీపం
ABN , Publish Date - Nov 11 , 2026 | 12:17 AM
కాణిపాకంలోని వరసిద్ధుడి ఆలయానికి అనుబంధ మణికంఠేశ్వరాలయంలో కార్తీక మాసం మొదటి రోజైన మంగళవారం సాయంత్రం అధికారులు, అర్చకులు ఆకాశ దీపాన్ని నింగికి ఎగురవేశారు.
ఐరాల(కాణిపాకం), నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలోని వరసిద్ధుడి ఆలయానికి అనుబంధ మణికంఠేశ్వరాలయంలో కార్తీక మాసం మొదటి రోజైన మంగళవారం సాయంత్రం అధికారులు, అర్చకులు ఆకాశ దీపాన్ని నింగికి ఎగురవేశారు. రాతి ధ్వజస్తంభం వద్ద ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్ పూజలు నిర్వహించారు. అనంతరం ఆకాశ దీపాన్ని సంప్రదాయబద్ధంగా వెలిగించారు. కప్పిపైకి లాగి భక్తుల దర్శనార్థం ఉంచారు. ఏటా కార్తీక మాసం తొలి రోజు ఆకాశ దీపాన్ని నింగికి ఎగుర వేయడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో ఈవో పెంచలకిషోర్, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్ బాలాజీనాయుడు తదితరులు పాల్గొన్నారు.