Share News

School: తెరుచుకున్న బడులు

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:17 AM

జిల్లాలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజున ఎక్కువమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని బడులకు తీసుకొచ్చారు.

School: తెరుచుకున్న బడులు
విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతున్న టీచర్లు

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజున ఎక్కువమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని బడులకు తీసుకొచ్చారు. కొత్త తరగతుల్లో అడుగుపెట్టిన చిన్నారులకు ఉపాధ్యాయులు పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు మొదటి రోజే పలు పాఠశాలల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పేరుతో స్టూడెంట్‌ కిట్స్‌, పాఠ్యపుస్తకాలు అందించారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం వడ్డించారు. తొలి రోజున 65 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. బడి తెరిచిన బోధన, బోధనేతర సిబ్బందిలో జిల్లాలో 8241 మంది ఉండగా.. తొలిరోజున 8017 మంది (97.41 శాతం) విధులకు హాజరయ్యారు. వీరిలో టీచర్లు 7544, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ 473 మంది ఉన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 01:18 AM