Share News

Fevers: విజృంభించిన జ్వరాలు

ABN , Publish Date - Jul 31 , 2026 | 01:33 AM

జిల్లాలో వైరల్‌, డెంగీ జ్వరాలు విజృంభించాయి. తిరుపతిలో చాలా ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిట లాడుతున్నాయి.

Fevers: విజృంభించిన జ్వరాలు
చికిత్స పొందుతున్న జనం

తిరుపతి సెంట్రల్‌, జూలై 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైరల్‌, డెంగీ జ్వరాలు విజృంభించాయి. తిరుపతిలో చాలా ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిట లాడుతున్నాయి.రోజువారీ ఓపీల్లో జ్వర పీడితులే ఎక్కువగా వుంటున్నారు.జ్వర పీడితుల్లో 60శాతం వైరల్‌, 40శాతం డెంగీ పీడితులు వున్నారని శ్వేత ఆస్పత్రి డాక్టర్‌ ఏఈఆర్‌ రెడ్డి చెప్పారు. రాజంపేట, రైల్వే కోడూరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, గూడూరు ప్రాంతాల నుంచి ఎక్కువగా జ్వర పీడితులు తిరుపతికి వస్తున్నారు.ఈ విషయమై డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్‌ మాట్లాడుతూ వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా జ్వర పీడితులు పెరుగుతున్నారని చెప్పారు. అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో వుంచామన్నారు. జ్వరం వస్తే సమీపంలోని వైద్యులను సంప్రదించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.దోమల బారిన పడకుండా తెరలు వాడడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు.ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా వుండాలన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 01:33 AM