PD Act: పీడీ యాక్టు
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:09 AM
వరుస నేరాలకు పాల్పడుతున్న ఐరాల మండలం వెంగనపల్లెకు చెందిన సంపంగి రామకృష్ణ అలియాస్ రాకే్‌షపై పీడీ యాక్టును నమోదు చేశారు.
చిత్తూరు అర్బన్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): వరుస నేరాలకు పాల్పడుతున్న ఐరాల మండలం వెంగనపల్లెకు చెందిన సంపంగి రామకృష్ణ అలియాస్ రాకే్‌షపై పీడీ యాక్టును నమోదు చేశారు. నిందితుడ్ని శనివారం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కొంత కాలంగా ఇతను విఽధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఫిర్యాదులున్నారు. భూ ఆక్రమణలు, బెదిరింపులకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు పోలీసులు తమ నివేదికలో తెలిపారు. నిందితుడిపై ఐరాల, ఇతర పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఈక్రమంలో కలెక్టర్, జిల్లా మేజిస్ర్టేట్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు రామకృష్ణపై పీడీయాక్టును నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణకు విఘాతం కలిగించే నేరాలకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు.