Share News

Leopard: చిరుత భయం

ABN , Publish Date - Apr 21 , 2026 | 01:27 AM

చిత్తూరు నగరం రెవెన్యూ గుంట హౌసింగ్‌ కాలనీవాసులకు చిరుత భయం వెన్నాడుతోంది.

Leopard: చిరుత భయం

చిత్తూరు సెంట్రల్‌, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగరం రెవెన్యూ గుంట హౌసింగ్‌ కాలనీవాసులకు చిరుత భయం వెన్నాడుతోంది. కాలికి గాయమై ఆదివారం రెండు సంవత్సరాల చిరుత ఇక్కడ చనిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఎఫ్‌ఆర్వో థామస్‌ సుకుమార్‌ సిబ్బందితో గుట్టతో పాటు అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. డ్రోన్‌ కెమెరాతో గుట్టను ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. మరో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించి, స్థానికుల్ని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో సోమవారం చిరుత తమ నివాస ప్రాంతాలకు వచ్చిందని భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. చిరుత సంచారాన్ని అటవీ సిబ్బందికి అందజేయగా, తూర్పు ఎఫ్‌ఆర్వో సిబ్బందితో రెవెన్యూ గుట్టకు చేరుకుని, సాయంత్రం వరకు డ్రోన్‌ కెమెరాలతో గుట్టతో పాటు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇటువైపుగా చిరుత సంచారం లేదని నిర్ధారణ కావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Apr 21 , 2026 | 01:29 AM