Share News

Govt: ప్రభుత్వ సేవలపై పెరిగిన సంతృప్తి

ABN , Publish Date - Mar 21 , 2026 | 02:08 AM

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు గురించి జిల్లా ప్రజల్లో 69.3 మంది సంతృప్తిగా ఉంటే.. 30.7 మంది అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన ఆరో కలెక్టర్ల సదస్సులో పబ్లిక్‌ పాజిటివ్‌ పర్‌సెప్షన్‌ రిపోర్టును విడుదల చేశారు.

Govt: ప్రభుత్వ సేవలపై పెరిగిన సంతృప్తి

ఆర్టీసీ బస్టాండు సేవల్లో తగ్గుదల

చిత్తూరు, ఆంధ్రజ్యోతి: గతేడాది డిసెంబరులో జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్రజలు 64.2 శాతం మంది ప్రభుత్వ సేవలపై సంతృప్తిగా ఉన్నారు. మార్చి నెలలో ఆ శాతం 5.1 శాతం పెరిగి, 69.3కు చేరింది. చిత్తూరు జిల్లాకు 18వ స్థానం దక్కగా.. తిరుపతికి 16, అన్నమయ్యకు 25వ స్థానాలు దక్కాయి. తిరుపతి జిల్లా 67.2 నుంచి 69.6 శాతానికి, అన్నమయ్య జిల్లా 63.9 నుంచి 66.6 శాతానికి ఎగబాకాయి. గత శాతంతో పోల్చుకుంటే పొరుగు రెండు జిల్లాల కంటే చిత్తూరులోనే ఎక్కువ శాతం (5.1ు) పెరిగింది.

ఆయా అంశాల్లో జిల్లా ప్రజల సంతృప్తి శాతం:-

అంశం తొలిఏడాది ప్రస్తుతం

పెన్షన్ల పంపిణీ 85.4 88.1

అన్న క్యాంటీన్‌ 79.6 83.0

దీపం-2 67.6 68.5

ఆర్టీసీ బస్సు సేవలు 66.1 81.0

ఆర్టీసీ బస్టాండు సేవలు49.1 44.7

హాస్పిటల్‌ సేవలు 62.1 73.1

రిజిస్ర్టేషన్‌ సేవలు 62.7 68.5

హౌసింగ్‌ స్కీమ్‌ 65.4 66.4

సర్వే (రెవెన్యూ)సేవలు 34.1 54.9

రేషన్‌ పంపిణీ 74.8 81.7

ఈ నాలుగు సేవల్లో భారీ సంతృప్తి

పెన్షన్లు, రేషన్‌ పంపిణీ, అన్న క్యాంటీన్‌, ఆర్టీసీ బస్సుల సేవల పట్ల మాత్రమే జిల్లా ప్రజలు ఎక్కువగా సంతృప్తి చెందుతున్నారు. ఈ నాలుగు సేవల పట్ల 80 శాతానికిపైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. పెన్షన్లు భారీగా పెంచి ఇంటి వద్దకెళ్లి పంపిణీ చేస్తుండడంతో ఏకంగా 88.1 శాతం మంది పాజిటివ్‌గా ఉన్నారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడంతో కొంతమంది అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడంతో 81 శాతం మంది, మూడు పూటలా రూ.5 చొప్పున కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్ల మీద 83 శాతం మంది పాజిటివ్‌గా ఉన్నారు.


ఈ అంశాల్లో స్వల్ప పెరుగుదల

మహిళలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు అందిస్తున్న దీపం-2 పథకం, హౌసింగ్‌ స్కీమ్‌ పట్ల గతేడాదితో పోల్చుకుంటే స్వల్పంగా మాత్రమే సంతృప్తి స్థాయి పెరిగింది. వైసీపీ హయాంలో రూ.1.50 లక్షలుగా ఉన్న పక్కా గృహ యూనిట్‌ ధరను తాజాగా కూటమి ప్రభుత్వం రూ.2.39 లక్షలకు పెంచడంతో 65.4 శాతం నుంచి 66.4 శాతానికి పెరిగింది.

బస్టాండు సేవలపై 55.3 శాతం అసంతృప్తి

ఆర్టీసీ బస్టాండ్ల నిర్వహణ విషయంలో గతేడాది కంటే ఇప్పుడు పాజిటివ్‌ శాతం తగ్గింది. గతేడాది 49.1ు ఉండగా, అది ఇప్పుడు 44.7ుగా ఉంది. సిబ్బంది ప్రవర్తన, బస్టాండుల్లో శుభ్రత, తాగునీటి సౌకర్యం వంటి అంశాల్లో 55.3ు ప్రయాణికులు అసంతృప్తిగా ఉన్నారు. ఉచిత ప్రయాణం కారణంగా బస్సు సేవల్లో 81ు మంది సంతృప్తిగా ఉన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 02:08 AM