Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ
ABN , Publish Date - Jun 13 , 2026 | 01:20 AM
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాటేజీ పరిసరాలు, రోడ్లు, కల్యాణకట్టలు, అఖిలాండం, లడ్డూ విక్రయ కేంద్రం వంటి ప్రాంతాలు రద్దీగా మారిపోయాయి.
తిరుమల, జూన్ 12(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాటేజీ పరిసరాలు, రోడ్లు, కల్యాణకట్టలు, అఖిలాండం, లడ్డూ విక్రయ కేంద్రం వంటి ప్రాంతాలు రద్దీగా మారిపోయాయి. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు వ్యాపించింది. వీరికి 14 గంటల దర్శన సమయం పడుతోంది. ఇక, టైం స్లాట్ భక్తులకూ రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది.