Prison: బతికున్నంత కాలం జైలులోనే..
ABN , Publish Date - Jul 11 , 2026 | 01:32 AM
పోక్సో కేసులో ఓ యువకుడికి బతికున్నంత కాలం జైలుశిక్ష, జరిమానా విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం తీర్పు చెప్పింది.
చిత్తూరు లీగల్/వడమాలపేట, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో ఓ యువకుడికి బతికున్నంత కాలం జైలుశిక్ష, జరిమానా విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం తీర్పు చెప్పింది. వివరాలిలా ఉన్నాయి. 2024 నవంబరు ఒకటో తేదీన వడమాలపేట మండలానికి చెందిన మూడున్నరేళ్ల బాలికను, వరుసకు మేనమామ అయిన యువకుడు బిస్కట్లు కొనిస్తానని తీసుకెళ్లాడు. శివారులోనినిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి ఏడవడంతో గొంతు నులిమి హత్య చేశా డు. తమ కుమార్తె కనబడలేదంటూ తల్లిదండ్రులు అదేరోజు రాత్రి వడమాలపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు శుక్రవా రం చిత్తూరులోని పోక్సో కోర్టులో వాయిదా ఉండింది. పూర్వాపరాలు పరిశీలించిన పోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక నిందితుడిపై నేరం రుజువు కావడంతో బతికున్నంత కాలం జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.పది లక్షల నష్టపరిహారం చెల్లించాలని తిరుపతి కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కేసును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.మోహన్ కుమారి వాదించారు.