Share News

HIV control: హెచ్‌ఐవీ నియంత్రణలో జిల్లాకు ‘సురక్షిత్‌’ హోదా

ABN , Publish Date - Nov 22 , 2026 | 01:11 AM

హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాల అమలులో జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు.

HIV control: హెచ్‌ఐవీ నియంత్రణలో జిల్లాకు  ‘సురక్షిత్‌’ హోదా
కేంద్రం నుంచి అందిన గుర్తింపులేఖను కలెక్టర్‌కు అందజేస్తున్న డీఎంహెచ్‌వో, ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాల అమలులో జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను (హెచ్‌ఐవీ నిర్ధారణ, చికిత్స, వైరస్‌ నియంత్రణ) జిల్లా విజయవంతంగా సాధించడంతో ‘సురక్షిత్‌’ హోదా లభించిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ నాగ శశిభూషణ రెడ్డి, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డాక్టర్‌ వెంకటప్రసాద్‌లకు డిసెంబర్‌ 1న ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో అవార్డు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ గుర్తింపు జిల్లాలో హెచ్‌ఐవీ వ్యాధి నిర్ధారణ, ఏఆర్‌టీ చికిత్సా సేవలు, వైరస్‌ నియంత్రణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలుచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృషికి నిదర్శనమని ఆయన ప్రశంసించారు.

Updated Date - Nov 22 , 2026 | 01:11 AM