Share News

PPP: పీపీపీ విధానంతో పేదలకు కార్పొరేట్‌ వ్యైద్యం

ABN , Publish Date - Mar 10 , 2026 | 01:49 AM

సీఎం చంద్రబాబు ముందుచూపుతో తీసుకొచ్చిన పీపీపీ విధానం ద్వారా పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందుతోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి అన్నారు.

PPP: పీపీపీ విధానంతో పేదలకు కార్పొరేట్‌ వ్యైద్యం
అత్యవసర విభాగాన్ని ప్రారంభిస్తున్న మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి

చిత్తూరు రూరల్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ముందుచూపుతో తీసుకొచ్చిన పీపీపీ విధానం ద్వారా పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందుతోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి అన్నారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో సోమవారం సాయంత్రం అపోలో వారు రూ.2.5 కోట్లతో ఆధునికీకరించిన ఎమర్జెన్సీ వార్డును, ట్రామా కేర్‌ను ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ప్రారంభించారు. పేదలకు ఎటువంటి ఖర్చు లేకుండా కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడమే పీపీపీ విధాన లక్ష్యమన్నారు. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన బాధితులకు తక్షణమే నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ట్రామా కేర్‌ సెంటర్‌ ఉపయోగపడుతుందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. 60 పడకలను అత్యవసర వైద్య సేవల కోసం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్‌, మరళీమోహన్‌, చూడా చైర్‌పర్సన్‌ హేమలత, మేయర్‌ అముద, అపోలో వైస్‌ ఛాన్సలర్‌ వినోద్‌భట్‌, అపోలో యూనిట్‌ హెడ్‌ బాలరాజ్‌, ఏవో రాంగోపాల్‌రెడ్డి, డీసీహెచ్‌ఎ్‌స పద్మంజలిదేవి, ఆస్పత్రి ఎంఎస్‌ ఉషశ్రీ, ఆర్‌ఎంవో సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 01:49 AM