EX MLA: రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:53 AM
ముందస్తు అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించినందుకు రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రైల్వేకోడూరు రూరల్, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ముందస్తు అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించినందుకు రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీనివాసులు పట్టణంలోని టోల్‌గేట్ వద్ద ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. అనుమతి లేకుండా నిరసన చేపట్టడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగిందని పోలీసులు ఆయనతో పాటు మరో 16 మందిపై కేసు నమోదు చేశారు. చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగేలా నిరసన చేపట్టడంతో చర్యలు తీసుకున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.