Share News

SC Corporation: పదేళ్లుగా కంతులు చెల్లించని లబ్ధిదారులు

ABN , Publish Date - May 10 , 2026 | 12:53 AM

సుమారు పదేళ్ల నాటి రుణాలను వసూలు చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. లబ్ధిదారుల ఇళ్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడంలేకపోవడంతో ఏంచేయాలో వీరికి పాలుపోవడంలేదు.

SC Corporation: పదేళ్లుగా కంతులు చెల్లించని లబ్ధిదారులు

నాలుగో వంతూ వసూలుకాని వైనం

లబ్ధిదారుల చుట్టూ ప్రదక్షిణలు

చిత్తూరు అర్బన్‌, మే 9(ఆంధ్రజ్యోతి): సుమారు పదేళ్ల నాటి రుణాలను వసూలు చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. లబ్ధిదారుల ఇళ్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడంలేకపోవడంతో ఏంచేయాలో వీరికి పాలుపోవడంలేదు. రుణాలను తిరిగి రాబట్టకపోతే జీతాలు చెల్లించేది లేదని ప్రభుత్వం హెచ్చరిస్తుండటంతో వీరికి ముచ్బెమటలు పడుతున్నాయి.

రుణాల మంజూరు ఇలా..

2015-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కింద సబ్సిడీ రుణాలను మంజూరు చేసింది. నేషనల్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎ్‌ఫడీసీ)కింద చిరువ్యాపారాలకు రూ. 50వేల వంతున రుణాలను అందజేసింది. కొందరికి ఎక్కువ మొత్తంలో కూడా రుణాలిచ్చింది. చిత్తూరు జిల్లాలో 350 మందికి రూ. 12.10 కోట్లు, తిరుపతి జిల్లాలో 219 మందికి రూ.10.69 కోట్లు, అన్నమయ్య జిల్లాలో 48 మందికి రూ. 2.28 కోట్ల మేర లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలిచ్చింది. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 617 మందికి రూ.25.07 కోట్ల విలువైన యూనిట్లను మంజూరు చేసింది. నేషనల్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ సఫాయి కర్మచారి ఫైనాన్స్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎ్‌సకేఎ్‌ఫడీసీ) పథకం కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 396 మందికి రూ.7.25 కోట్లు సబ్సిడీ రుణాలను మంజూరుచేసింది. అయితే ఈ పదేళ్లలో ఎన్‌ఎ్‌సఎ్‌ఫడీసీ పథకం కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రూ.25.07కోట్లకు గాను రూ.7.04కోట్ల్లు, ఎన్‌ఎ్‌సకే ఎఫ్‌డీసీ పథకం కింద రూ. 7.25 కోట్లకు గాను రూ. 66.03 లక్షలు మాత్రమే వసూలయ్యాయి.


వసూలుకు మల్లగుల్లాలు

రుణాలను తిరిగి కంతుల వారీగా చెల్లించాలని అధికారులు గ్రామాల్లో తిరుగుతూ ప్రాధేయపడుతున్నారు. వెళ్లినప్పుడు కొంతమంది మొక్కుబడిగాచెల్లిస్తున్నారు. కొందరు ముఖం చాటేస్తున్నారు. కొందరు సంఘంగా ఏర్పడి రుణాన్ని చెల్లించడం లేదని అధికారులు చెబుతున్నారు. బెదిరింపు ధోరణిలో మాట్లాడుతుంటే మిన్నకుండిపోవల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈఆర్థిక సంవత్సరంలోపు తీసుకున్న రుణాలను చెల్లించిన వారికి వడ్డీమాఫీ చేస్తామని కేంద్రప్రభుత్వం చెప్ప డంతో 50మంది రుణాలను క్లియర్‌ చేశారు. మిగిలిన వారు మాత్రం పట్టించుకోవడంలేదు. పాత రుణాల రికవరీ వంద శాతం అయితేనే కొత్తవి మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రికవరీలో వెనుకబడ్డంతో కొత్త రుణాలు మంజూరుకు అవకాశం లేకుండా పోతోంది. అవి వసూలైతేనే కొత్త రుణాలిచ్చేందుకు ఆస్కారముంటుందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - May 10 , 2026 | 12:53 AM