Bear: మంగళంలో ఎలుగుబంట్ల సంచారం
ABN , Publish Date - Jul 01 , 2026 | 01:42 AM
తిరుపతిలోని శేషాచల సమీప అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న మంగళం పరిధిలోని తిరుమలనగర్‌లో ఎలుగుబంట్ల సంచారం జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
తిరుపతి(కపిలతీర్థం), జూన్ 30(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని శేషాచల సమీప అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న మంగళం పరిధిలోని తిరుమలనగర్‌లో ఎలుగుబంట్ల సంచారం జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మంగళవారం ఉదయం ఎలుగుబంట్లు సంచరిస్తుండడాన్ని స్థానికులు గుర్తించారు. మూడు పిల్లలతో ఓ ఎలుగుబంటి మంగళం, బీటీఆర్ కాలనీ, తిరుమలనగర్ ప్రాంతాల్లో మూడు నెలలుగా సంచరిస్తోందని చెబుతున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుని ప్రజలకు భరోసా కల్పించాల్సి వుంది.