Share News

Cinema: 40 ఏళ్ల వినోదానికి తెర

ABN , Publish Date - May 06 , 2026 | 12:51 AM

చిత్తూరు నగరంలోని రాఘవ థియేటర్‌ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు.

Cinema: 40 ఏళ్ల వినోదానికి తెర
రాఘవ థియేటర్‌, థియేటర్‌ను తొలగిస్తున్న దృశ్యం

చిత్తూరు రూరల్‌, మే 5(ఆంధ్రజ్యోతి): నగరంలోని రాఘవ థియేటర్‌ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా చిత్తూరు ప్రజలను వినోదాన్ని పంచిన ఈ థియేటర్‌లో పెద్ద హీరోల సినిమాల రిలీజ్‌ రోజన ఫ్యాన్స్‌ సందడి పండగ వాతావరణాన్ని తలపించేది. శుభలగ్నం 200 రోజులు, పోకిరి 175, పెళ్లిచేసుకుందాం, సీతారామాయ్యగారి మనవరాలు, అన్నమయ్య, హాలోబ్రదర్‌ లాంటి సినిమాలను ఎక్కువ రోజులు ప్రదర్శించారు. పాత తరం నుంచి నేటి తరం వరకు ఈ థియేటర్‌లో ఎందరికో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆధునిక ఓటీటీలు, డిజిటల్‌ మీడియాల క్రమంలో థియేటర్లకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. దీంతో ఈ థియేటర్‌ను యాజమాన్యం మూసివేయాలని నిర్ణయించింది. ఓ ప్రైవేటు ఈ-కామర్స్‌ సంస్థకు లీజుకిచ్చింది. ఈనేపథ్యంలో సోమవారం నుంచి తొలగింపు పనులను ప్రారంభించారు. ఆ స్థలంలో వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు కార్యాలయం నిర్మించనున్నట్లు సమాచారం.

Updated Date - May 06 , 2026 | 12:51 AM