విజయవాడ డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి కాంతిశ్రీ
ABN , Publish Date - Nov 24 , 2026 | 06:44 AM
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి కాంతిశ్రీకి అవకాశం దక్కింది. మాజీ కార్పొరేటర్, సీనియర్ నాయకుడైన చెన్నుపాటి గాంధీ...
వైసీపీ దాడిలో కన్నుపోగొట్టుకున్న గాంధీ సతీమణికి అవకాశం
విజయవాడ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి కాంతిశ్రీకి అవకాశం దక్కింది. మాజీ కార్పొరేటర్, సీనియర్ నాయకుడైన చెన్నుపాటి గాంధీ కుటుంబానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అవకాశం కాంతిశ్రీకి కల్పించారు. జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ గూండాల దాడి కారణంగా చెన్నుపాటి గాంధీ కన్ను పొగొట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో గాంధీ ఇంటికి వచ్చి పరామర్శించారు. గాంధీకి న్యాయం చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ సీటును జనసేనకు ఇచ్చారు. దీంతో డిప్యూటీ మేయర్‌గా గాంధీ సతీమణి కాంతిశ్రీకి అవకాశం కల్పించారు.
ఈ వార్తలనూ చదవండి: