ఉద్యోగులకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:56 AM
ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధుల్లో కెపాసిటీ బిల్డింగ్ కోసం శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పేదల అభివృద్ధి కోసం తెచ్చిన పీ4 విధానాన్ని మరింతమందికి చేరువ చేయడంతోపాటు సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ తరహాలో ఒక వ్యవస్థను దానిపై పర్యవేక్షణకు ...
సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ తరహాలో పీ4పై పర్యవేక్షణ
పథకాల మధ్య సమన్వయంతో పేదలకు గరిష్ఠ లబ్ధి
అధికారులు, మంత్రులతో సీఎం జూమ్ కాన్ఫరెన్స్
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధుల్లో కెపాసిటీ బిల్డింగ్ కోసం శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పేదల అభివృద్ధి కోసం తెచ్చిన పీ4 విధానాన్ని మరింతమందికి చేరువ చేయడంతోపాటు సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ తరహాలో ఒక వ్యవస్థను దానిపై పర్యవేక్షణకు ఏర్పాటు చేయాలని సూచించారు. ‘పేదల సేవలో- సంక్షేమ కార్యక్రమాలు’ అనే అంశంపై బుధవారం అందుబాటులోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకాల మధ్య సమన్వయంతో (కన్వర్జెన్స్) పేదలకు గరిష్ఠ ప్రయోజనం అందించగలమని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ‘‘పీ4 మోడల్ రాష్ట్రంలో అమలు అవుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలి. ఆర్థిక అసమానతలు తగ్గేలా సంక్షేమంతోపాటు ఫీ4 ద్వారా చేయూత అందించాలి. పీ4 కార్యక్రమం కింద 11 లక్షల మంది బంగారు కుటుంబాలకు ఇప్పటికే మార్గదర్శకులు చేయూత అందిస్తున్నారు.
స్త్రీశక్తి, తల్లికి వందనం, దీవం వంటి పథకాలతో పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోంది. పేదరికం, ఆర్థిక అసమానతలు లేని దిశగా నియోజకవర్గాలను తీర్చిదిద్దాలి. పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతల తగ్గింపు నిరంతర ప్రక్రియగా సాగాలి. పౌర సేవలను సమర్థవంతంగా అందించాలి. పాలనకు టెక్నాలజీని వినియోగిస్తే పౌర సేవలను మరింత సులభంగా అందించవచ్చు.’’ అని సీఎం తెలిపారు. ఉద్యోగులకు ఐఐటీలు, ఐఐఎంల ద్వారా కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ఇచ్చే అంశం పరిశీలనలో ఉన్నదన్నారు.
స్వయం బ్రాండ్ ద్వారా డ్వాక్రా మహిళల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు సమకూరుతున్నాయి. అభివృద్ధి పనులు పూర్తి పారదర్శకంగా , నాణ్యతతో చేపట్టాలి. ప్రతి ఏటా అక్టోబరు 2న స్వచ్ఛాంధ్ర అవార్డుల కార్యక్రమం చేపడతాం. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకూ వివిధ కేటగిరీల్లో అవార్డులు ప్రకటిస్తాం. ద్రవ్యోల్బణ భారం ప్రజలపై పడకుండా అన్ని స్థాయిల్లో జాగ్రత్త పడాలి. రైతు బజార్లలో తక్కువ ధరకు ఉల్లి అందించే చర్యలు చేపట్టాం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పని చేయాలి.’’ అని సీఎం ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’