ఏబీఎన్ పూర్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 23 , 2026 | 09:34 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ పూర్ణచందర్ రావు అకాల మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అమరావతి, మార్చి23: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ పూర్ణచందర్ రావు అకాల మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన పూర్ణచందర్ రావు నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా పూర్ణచందర్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు. అనంతరం పూర్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. సీఎం మాట్లాడుతూ.. ‘పూర్ణచందర్ రావు లేని లోటు తీర్చ లేనిది, ఓ మంచి జర్నలిస్టును, అత్యంత ఆత్మీయుడిని కోల్పోయాను. ఆయనకు పనిపట్ల ఉన్న నిబద్ధత అందరికీ ఆదర్శం. జర్నలిజం రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూర్ణచందర్ రావు మృతి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయన కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మాది’ అని అన్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
క్షిపణిపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్ పైకి ప్రయోగించిన ఇరాన్..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ పులుల మధ్యనున్న జీబ్రాను 10 సెకెన్లలో కనిపెట్టండి..