పారిశ్రామికవేత్త జీఎన్ నాయుడుకు ఏపీ సీఎం నివాళి
ABN , Publish Date - May 03 , 2026 | 05:09 AM
పారిశ్రామికవేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారన్న చంద్రబాబు
జీఎన్ నాయుడుకు నివాళులర్పించిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ
హైదరాబాద్ సిటీ, మే 2 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామికవేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని జీఎన్ నాయుడు నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. జీఎన్ నాయుడు భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీఎన్ నాయుడుతో తనకు ఉన్న పరిచయాన్ని ఏపీ సీఎం గుర్తు చేసుకున్నారు. కాగా, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా జీఎన్ నాయుడు భౌతిక కాయానికి నివాళులర్పించారు. జీఎన్ నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. జీఎన్ నాయుడు సమాజానికి అందించిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.