Share News

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమికి 98 శాతం స్ట్రైక్‌ రేట్‌!

ABN , Publish Date - Oct 10 , 2026 | 04:17 AM

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలిచి.. 98 శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధిస్తారని తమ సర్వేలో తేలిందని ‘చాణక్య స్ట్రాటజీస్‌’ పొలిటికల్‌ సర్వే సంస్థ ఎండీ చాణక్య ముఖేశ్‌ వెల్లడించారు.

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమికి 98 శాతం స్ట్రైక్‌ రేట్‌!

  • సర్వే సంస్థ ‘చాణక్య స్ట్రాటజీస్‌’ ఎండీ ముఖేశ్‌ వెల్లడి

  • రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ర్యాంకింగ్‌ విడుదల

  • టాప్‌-3 మంత్రుల్లో లోకేశ్‌, నిమ్మల, నారాయణ

  • ఎమ్మెల్యేల్లో లోకేశ్‌, కోటంరెడ్డి, పవన్‌

  • ఎంపీల్లో పెమ్మసాని, రామ్మోహన్‌, వేమిరెడ్డి టాప్‌

హైదరాబాద్‌, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలిచి.. 98 శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధిస్తారని తమ సర్వేలో తేలిందని ‘చాణక్య స్ట్రాటజీస్‌’ పొలిటికల్‌ సర్వే సంస్థ ఎండీ చాణక్య ముఖేశ్‌ వెల్లడించారు. ఏపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై జూలై చివరి వారం నుంచి సెప్టెంబరు చివరి వారం వరకు పబ్లిక్‌ మూడ్‌పై సర్వే నిర్వహించామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ సొమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన సర్వే నివేదికను విడుదల చేశారు. 174 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో వివిధ వర్గాలకు చెందిన 52,500 మందిని తమ బృందాలు స్వయంగా కలిసి సర్వే నిర్వహించాయని తెలిపారు. టీడీపీవైపు 46.9శాతం శాతం, వైసీపీకి 35, జనసేనకు 9, బీజేపీకి 3.5, ఇతరుల వైపు 5.6 శాతం మొగ్గు చూపారని చెప్పారు. మంత్రుల పనితీరుపై సర్వేలో... ‘టాప్‌-3లో లోకేశ్‌, నిమ్మల రామానాయుడు, పి.నారాయణ ఉండగా.. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నాలుగో స్థానంలో నిలిచారు. ఎమ్మెల్యేల్లో మొదటి మూడు స్థానాల్లో లోకేశ్‌ (మంగళగిరి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్‌), పవన్‌ కల్యాణ్‌ (పిఠాపురం) ఉన్నారు. ఎంపీల్లో మొదటి స్థానంలో గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌, తర్వాతి స్థానాల్లో శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు’ అని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేకున్నా.. కొంతమంది ఎమ్మెల్యేలపై మాత్రం ఉందని చెప్పారు. వీరిలో మొదటిసారి గెలిచిన వారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు.


తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు మొగ్గు!

తెలంగాణలో త్వరలో జరుగనున్న వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు మొగ్గు ఉందని చాణక్య ముఖేశ్‌ చెప్పారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన రాకేశ్‌రెడ్డిపై సానుభూతి ఉందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండడంతో ఖైరతాబాద్‌లో పవర్‌ పాలిటిక్స్‌కు అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 04:17 AM