Share News

కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:35 AM

రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ మృతి కేసులో సీబీఐ అధికారులు శనివారం కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో విచారణ కొనసాగించారు. స్టేషన్‌ పరిసరాలను, లాక్‌పలు, ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐల చాంబర్లు, సిబ్బంది కూర్చునే హాలు, రైటర్‌ క్యాబిన్‌ను వీడియో తీశారు.

కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ

  • సాయికృష్ణ కేసులో రెండో రోజు విచారణ

  • నేడు ఇద్దరు నిందితుల ఇళ్లలో సోదాలు

విజయవాడ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ మృతి కేసులో సీబీఐ అధికారులు శనివారం కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో విచారణ కొనసాగించారు. స్టేషన్‌ పరిసరాలను, లాక్‌పలు, ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐల చాంబర్లు, సిబ్బంది కూర్చునే హాలు, రైటర్‌ క్యాబిన్‌ను వీడియో తీశారు. మంగళగిరిలోని ఫొరెన్సిక్‌ సైన్‌ ల్యాబ్‌ నుంచి నిపుణులను రప్పించి నమూనాలు సేకరింపజేశారు. సిట్‌ అధికారులు అందజేసిన ఫైళ్లను రాత్రి వరకు పరిశీలించారు. సీబీఐ హైదరాబాద్‌ ప్రాంతీయ స్టేషన్‌ అదనపు ఎస్పీ సీహెచ్‌వీ నరేంద్రదేవ్‌తో పాటు డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు మొత్తం పది మందికి పైగా దర్యాప్తులో ఉన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న గులివిందల సురేష్‌కుమార్‌(ఏ4), కోనేటి వెంకటరాజు (ఏ7) ఇళ్లలో ఆదివారం సోదాలు చేయడానికి సీబీఐ అధికారులు సిద్ధమయ్యారని తెలిసింది.

వారిలో సురేష్‌కుమార్‌ నాటి ఇన్‌స్పెక్టర్‌ నాగరాజుకు అత్యంత సన్నిహితుడు కాగా వెంకటరాజు పోలీసు స్టేషన్‌లో సీసీ కెమెరాల వ్యవహారాలను పర్యవేక్షించడానికి హోంగార్డుగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న మాజీ హెడ్‌కానిస్టేబుల్‌ పోతర్లంక అశోక్‌కుమార్‌ ఆదేశాలతో స్టేషన్‌లో డీవీఆర్‌లు, హార్డ్‌డి్‌స్కను వెంకటరాజు మాయం చేసినట్టు సిట్‌ అధికారులు నిర్ధారించారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకురావడం, తర్వాత బయటకు తీసుకెళ్లడం వంటి దృశ్యాలను చిత్రీకరించిన ప్రధాన ద్వారం వద్ద ఉన్న సీసీ కెమెరాను తొలగించినట్లు గుర్తించారు. ఆ హార్డ్‌డిస్కులు, డీవీఆర్‌ ఆచూకీని కనిపెట్టే పనిలో సీబీఐ ఉన్నట్టు తెలుస్తోంది. సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ అనంతరం అతని కుటుంబ సభ్యులతో సురేష్‌కుమార్‌ రాయబేరాలు నడిపారు. ఈ ఇద్దరి ఇళ్లలో సోదాలు చేయడానికి సంబంధించి కోర్టు ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 05:35 AM