వార్డు మెంబర్ ఓటుకు రూ.9 వేలు
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:20 AM
పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల్లో డబ్బు వరదలా ప్రవహించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఒక గ్రామంలో అభ్యర్థి ఓటుకు ...
మహిళలకు చీరలు.. పురుషులకు మద్యం కూడా!
పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల్లో డబ్బు వరదలా ప్రవహించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఒక గ్రామంలో అభ్యర్థి ఓటుకు రూ.6 వేలు ఇచ్చారు. మిగిలిన ఇద్దరు అభ్యర్థులూ ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంచారు. మరో పంచాయతీలో ఇద్దరు అభ్యర్థులు ఒకరు రూ.4వేలు, మరొకరు రూ.5వేలు ఇచ్చారు. దీంతో ఇక్కడ ఒక్కో ఓటరుకు రూ.9వేలు ముట్టింది. పాలకొల్లు రోడ్డులోని ఓ పంచాయతీలో వార్డు మెంబర్ అభ్యర్థి ఒకరు రూ.4వేలిస్తే... ప్రత్యర్థి రూ.5 వేలిచ్చారు. దీంతో ఈ వార్డులోని ఓటర్లకు రూ.9 వేలు చొప్పున ముట్టింది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని తాటుకూరుగొమ్ము, రుద్రమ్మకోట పంచాయతీల్లో ఓటుకు రూ.3 వేలు చొప్పున ఇచ్చి, మహిళా ఓటర్లకు చీరలు పంపిణీ చేశారు.
- నరసాపురం/వేలేరుపాడు, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా