విజయవాడలో వాగులో కొట్టుకుపోయిన కారు
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:34 AM
విజయవాడ రూరల్ మండలం నున్నలో భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న పెద్ద వాగును దాటేందుకు ప్రయత్నించిన కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆ గ్రామ టీడీపీ అధ్యక్షుడు కలకోటి శ్రీనివాసరెడ్డి దంపతులు నీటి ఉధృతిలో చిక్కుకున్నారు.
టీడీపీ నేత కుటుంబాన్ని కాపాడిన గ్రామస్థులు
విజయవాడ రూరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ రూరల్ మండలం నున్నలో భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న పెద్ద వాగును దాటేందుకు ప్రయత్నించిన కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆ గ్రామ టీడీపీ అధ్యక్షుడు కలకోటి శ్రీనివాసరెడ్డి దంపతులు నీటి ఉధృతిలో చిక్కుకున్నారు. గురువారం తెల్లవారు జామున శ్రీనివాసరెడ్డి తన భార్యతో కలిసి కారులో పాల కోసం తన పశువుల కొట్టంకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. సకాలంలో గ్రామస్థులు గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. నీటి ప్రవాహానికి వారు ప్రయాణిస్తున్న కారు, 20 మీటర్ల వరకు వాగులో కొట్టుకుపోయి సమీపంలోని చెట్టకు చిక్కుకుని ఆగిపోయింది.
ఈ వార్తలనూ చదవండి...
అదానీ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు..