పులివెందులలో ప్రశాంతత భగ్నానికి జగన్, అవినాశ్ యత్నం
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:28 AM
పులివెందులలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు జగన్, అవినాశ్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ఆరోపించారు.
నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ఆరోపణ
పులివెందుల, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పులివెందులలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు జగన్, అవినాశ్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ఆరోపించారు. ‘ఇటీవలి కాలంలో పులివెందులలో కాల్పుల ఘటనలు జరగలేదు. అటువంటిది మొన్న మున్సిపల్ నామినేషన్ల సందర్భంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపేలా వైసీపీ వాళ్లు చేశారు. మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి జగన్ చొక్కి మడతెట్టాం, ఎవరు వస్తారో రండని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అవినాశ్‌రెడ్డి కూడా రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారు.
ఎన్నికలను భగ్నం చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వైసీపీ గూండాలను తీసుకొచ్చి వైఎస్సార్ ఆడిటోరియంలో పెట్టారు. నేషనల్ మీడియాను, మీడియాను పిలిపించి వాటి వాహనాలను కూడా వారే తగులబెట్టి విధ్వంసం సృష్టించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఏ ఎన్నిక వచ్చినా వైఎస్ కుటుంబ సభ్యులకు తప్ప వేరేవారికి అవకాశం ఇవ్వడం లేదు. టీడీపీ నుంచి పులివెందుల చైర్‌పర్సన్ అభ్యర్థిగా మా కుటుంబ సభ్యులను కాకుండా తూగుట్ల గీతను నిలబెట్టాం. ఓటర్లు కానివారిని పులివెందులలో లేకుండా చూడాలని పోలీసులను కోరుతున్నాం’ అని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!