Share News

అప్పుడెందుకు ‘హే రామ్‌’ అనలేదు?

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:33 AM

‘హిందువుల మనోభావాలు రెచ్చగొట్టి, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు జగన్‌, ఆ పార్టీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నారు’ అంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ మండిపడ్డారు.

అప్పుడెందుకు ‘హే రామ్‌’ అనలేదు?

వైసీపీ పాలనలోనే ఆలయ తరలింపు ప్రక్రియ :యామినీ శర్మ

‘హిందువుల మనోభావాలు రెచ్చగొట్టి, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు జగన్‌, ఆ పార్టీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నారు’ అంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ మండిపడ్డారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో అభయాంజనేయ స్వామి ఆలయం తరలింపుపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ‘హే రామ్‌..! ఆలయాలను రక్షించండి’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆయన సొంత పత్రిక ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించింది.

దీనిపై యామినీ శర్మ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలన్నింటినీ పేర్కొంటూ అప్పుడు ఒక్కసారైనా ‘హే రామ్‌’ అనే మాట ఎందుకు రాలేదంటూ జగన్‌ను నిలదీశారు. రహదారి విస్తరణలో భాగంగా ఆలయ తరలింపు ప్రక్రియ జగన్‌ సీఎంగా ఉన్న సమయంలోనే మొదలైందంటూ ఆమె ఆధారాలను చూపించారు. జాతీయ రహదారి అధికారులు కేటాయించిన ప్రత్యామ్నాయ స్థలంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యవేక్షణలో ఆగమశాస్త్ర నియమాల ప్రకారం బాలాలయం నిర్మించి, విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించిన తర్వాతే పాత నిర్మాణాలు తొలగించినట్లు యామినీ శర్మ వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 01:36 AM