వైసీపీ అరాచకాల్ని ప్రజలు మర్చిపోలేదు: సోము
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:42 AM
అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సాగించిన అరాచకాలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ట్వీట్ చేశారు.
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సాగించిన అరాచకాలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ట్వీట్ చేశారు. ‘ఎలక్షన్ కాదు.. సెలక్షన్’ అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ ఎమ్మెల్సీ తిప్పికొట్టారు. ‘అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచిన తీరును మీరు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు జగన్ గారూ’ అంటూ ఎద్దేవా చేశారు. ‘ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే. వారిచ్చిన తీర్పును గౌరవించడం నేర్చుకోండి. ఐదేళ్లుగా మీ అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తిరస్కారం ఈ తీర్పు’ అంటూ సోము వీర్రాజు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్