సీఎంతో ఆదినారాయణరెడ్డి భేటీ
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:44 AM
జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.
వెంట బీజేపీ నేత మాధవ్ కూడా
కడప జడ్పీ బీజేపీకి ఇవ్వనందుకు అసంతృప్తి
అమరావతి/విజయవాడ అర్బన్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, తన సోదరుల కుమారులు చదిపిరాళ్ల రాజేశ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డిలతో కలిసి శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ముఖ్యమంత్రిని కలిశారు. కడప జడ్పీ పీఠాన్ని బీజేపీకి కేటాయించనందుకు ఆదినారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాటులో ఈ జడ్పీని బీజేపీకి ఇవ్వలేకపోయామని ముఖ్యమంత్రి ఆయనకు చెప్పారు. అంతకుముందు ఆదినారాయణరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లా స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి తాను కృషి చేశానని.. అయితే వంద శాతం విజయం సాధించినా కూటమి నాయకుల తీరు బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కృషిని గుర్తించకుండా జడ్పీ చైర్మన్ పదవి విషయంలో కూటమి పెద్దల తీరు తీవ్రంగా బాధించిందన్నారు. పులివెందులలో సైతం కూటమి విజయానికి కృషి చేశానన్నారు.
ఇవి కూడా చదవండి...
మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు
కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్