Share News

జగన్‌ ఇజంలో నిజం లేదు!

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:23 AM

‘స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికి మద్దతు పలికారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య చిచ్చుపెట్టాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. కూటమి విచ్ఛిన్నమయ్యే ప్రసక్తే లేదు’ అని బీజేపీ చీఫ్‌ విప్‌ సి.ఆదినారాయణరెడ్డి ...

జగన్‌ ఇజంలో నిజం లేదు!

  • కూటమి పార్టీల మధ్య విభేదాల సృష్టి వైసీపీ వల్ల కాదు: ఆదినారాయణరెడ్డి

అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికి మద్దతు పలికారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య చిచ్చుపెట్టాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. కూటమి విచ్ఛిన్నమయ్యే ప్రసక్తే లేదు’ అని బీజేపీ చీఫ్‌ విప్‌ సి.ఆదినారాయణరెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘జగన్‌ ఇజంలో నిజం లేదు. రాజకీయ మనుగడ కోసమే ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

స్థానిక ఎన్నికల ఫలితాలను సాధారణ ఎన్నికలతో పోల్చి చూడటం సరికాదు. వచ్చే ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాం. జగన్‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలి. జమ్మలమడుగు నియోజకవర్గంలో బీజేపీ విజయాలు పార్టీ బలాన్ని చాటుతున్నాయి. రానున్న రోజుల్లో పులివెందులలోనూ బీజేపీ బలపడుతుంది’ అని పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 05:23 AM