రేవంత్‌వి మతిభ్రమించిన మాటలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:38 AM
‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవుళ్లలో కూడా ‘పేద దేవుడు, ధనవంతుడైన దేవుడు’ అంటూ కొత్త నిర్వచనాలు తీసుకొచ్చారు. నిద్రలో కూడా ధనం పైనే ధ్యాస ఉండే వారికి, కాంగ్రెస్ పార్టీకి అంతా అలాగే కనిపిస్తుంది’
టీ-సీఎం తక్షణమే క్షమాపణ చెప్పాలి: భానుప్రకాశ్‌రెడ్డి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవుళ్లలో కూడా ‘పేద దేవుడు, ధనవంతుడైన దేవుడు’ అంటూ కొత్త నిర్వచనాలు తీసుకొచ్చారు. నిద్రలో కూడా ధనం పైనే ధ్యాస ఉండే వారికి, కాంగ్రెస్ పార్టీకి అంతా అలాగే కనిపిస్తుంది’ అని టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ ఏపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. బుధవారం, ఏపీ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మతి భ్రమించి హిందూ దేవుళ్లపై విద్వేష ప్రసంగాలు చేస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’