Share News

తుఫాన్‌ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలి

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:13 AM

అర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టులో గురువారం పిటిషన్‌ వేసినట్టు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌ తెలిపారు.

తుఫాన్‌ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలి

  • హైకోర్టులో రామచంద్రయాదవ్‌ పిటిషన్‌

పుంగనూరు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టులో గురువారం పిటిషన్‌ వేసినట్టు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌ తెలిపారు. పిటిషన్‌ స్వీకరించిన హైకోర్టు ఎన్నికల కమిషన్‌ అభిప్రాయాన్ని శుక్రవారం లోగా తెలియజేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా తుఫాన్‌ సహాయక చర్యల్లో వినియోగించాల్సిన సమయంలో ఎన్నికల విధులకు పంపండం వల్ల బాధితులకు న్యాయం జరగదని ఆయన పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 05:13 AM