Share News

బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:52 AM

దక్షిణ అండమాన్‌ సముద్రంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది.

బంగాళాఖాతంలో అల్పపీడనం

  • 15వ తేదీకల్లా వాయుగుండం

విశాఖపట్నం, అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): దక్షిణ అండమాన్‌ సముద్రంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. 14వ తేదీ నాటికి తీవ్ర అల్పపీడనంగా, 15వ తేదీకల్లా వాయుగుండంగా బలపడనున్నది. ఆతర్వాత పశ్చిమ వాయవ్యంగా పయనించి మరింత బలపడి తుఫాన్‌గా మారి 17వ తేదీ తర్వాత ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనున్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 15 నుంచి బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున నైరుతి, మధ్య బంగాళాఖాతం వైపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే వాయుగుండం ఎటు పయనిస్తుందో ఇంకా స్పష్టత రాలేదని, దీని ప్రభావం ఏపీపై ఉండకపోవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

రాష్ట్రంలో పెరిగిన చలి.. కిలగాడలో 12.3 డిగ్రీలు

విశాఖపట్నం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీతోపాటు మైదాన ప్రాంతాల్లో బుధవారం ఉదయం మంచు కురిసింది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలగాడలో 12.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 05:54 AM