Share News

వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో ఏఎస్పీ తలకు గాయం

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:53 AM

బాపట్ల జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఎల్‌.సుధాకర్‌పై వైసీపీ మద్దతుదారులు రాళ్లదాడి చేయడంతో ఆయన తలకు తీవ్రగాయమైంది. వివరాలు ఇలా ఉన్నాయి..

వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో ఏఎస్పీ తలకు గాయం

  • పోలీసు సిబ్బందికీ గాయాలు.. బాపట్ల జిల్లాలో ఘటన

బాపట్ల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఎల్‌.సుధాకర్‌పై వైసీపీ మద్దతుదారులు రాళ్లదాడి చేయడంతో ఆయన తలకు తీవ్రగాయమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో మార్టూరు ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు గురువారం రాత్రి మహిళలతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో మార్టూరులో పెద్దఎత్తున ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

విషయం తెలిసి అక్కడకు చేరుకున్న ఏఎస్పీ సుధాకర్‌ వైసీపీ శ్రేణులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేయడంతో ఏఎస్పీతో పాటు ఏఆర్‌ డీఎస్పీ, మహిళా హోంగార్డు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఏఎస్పీకి ఎడమ కన్ను పైభాగంలో రాయి బలంగా తగిలింది. ఆయనను మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం చేసిన అనంతరం చీరాలలోని ఆసుపత్రికి పంపారు. చికిత్స అనంతరం శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 06:53 AM