Share News

విమానాల్లో మళ్లీ ‘ఇరుముడి’కి అనుమతి

ABN , Publish Date - Nov 22 , 2026 | 02:48 AM

శబరిమల అయ్యప్ప భక్తులు ఇరుముడిని విమానాల్లో క్యాబిన్‌ బ్యాగేజీగా తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ అనుమతించింది.

విమానాల్లో మళ్లీ ‘ఇరుముడి’కి అనుమతి

శ్రీకాకుళం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): శబరిమల అయ్యప్ప భక్తులు ఇరుముడిని విమానాల్లో క్యాబిన్‌ బ్యాగేజీగా తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ అనుమతించింది. ఈ నెల 12 నుంచే ఈ వెసులుబాటు అమల్లోకి వచ్చింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పౌర విమానయాన భద్రతా సంస్థ (బీసీఏఎస్‌) అన్ని ప్రాంతీయ కార్యాలయాలు, విమానాశ్రయాల నిర్వాహకులు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్‌) అధికారులకు మార్గదర్శకాలు జారీచేసింది. అయ్యప్ప భక్తుల ఆచారాలు, విశ్వాసాలను గౌరవిస్తూ గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా అనుమతులు కొనసాగిస్తున్నామని మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 02:51 AM