70 మంది వైసీపీ పోలింగ్ ఏజెంట్లతో ఆర్వో కార్యాలయానికి ఎంపీ అవినాశ్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:18 PM
పులివెందులలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీకి చెందిన సుమారు 70 మంది పోలింగ్ ఏజెంట్లతో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆర్వో కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
కడప, నవంబర్ 1: జిల్లాలోని పులివెందులలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. సుమారు 70 మంది వైసీపీ పోలింగ్ ఏజెంట్లతో ఎంపీ అవినాశ్ రెడ్డి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. అయితే.. ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో అవినాశ్ రెడ్డి, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఎన్నికల సందర్భంగా పులివెందులలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తాజా ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 70 మంది వైసీపీ ఏజెంట్లతో ఎంపీ కార్యాలయానికి రావడం.. పోలీసులు ఆయనను అడ్డుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
పులివెందులలో జగన్ తీరుపై టీడీపీ వర్గాల ఆగ్రహం..
ఇదిలా ఉంటే.. పులివెందులలోని 70 పోలింగ్ బూత్‌లలో వైసీపీ ఏజెంట్లు లేరంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపైనా టీడీపీ వర్గాలు స్పందించాయి. 70 మంది పోలింగ్ ఏజెంట్లతో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆర్వో కార్యాలయానికి చేరుకోవడం వల్ల అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకుందని విమర్శించారు. తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లకు పంపించుకోలేని వైసీపీ నాయకులు, ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించాయి.
ఏజెంట్లను నియమించుకోవడం.. పోలింగ్ కేంద్రాలకు పంపించడం ఆయా పార్టీల బాధ్యత అని పేర్కొన్నాయి. తమ వైఫల్యాలను ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేయకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలని హితవు పలికాయి. పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా.. పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నాయి. రాజకీయంగా ఎదుర్కోలేక అల్లర్లు, ఆరోపణల ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ తీరును తప్పుబట్టాయి. ఎన్నికల సమయంలో అనవసర ఆరోపణలు, వివాదాలకు తావివ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!