Share News

భార్య మేయర్‌... భర్త కార్పొరేటర్‌

ABN , Publish Date - Nov 22 , 2026 | 01:16 AM

విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓ జంట అరుదైన ఘనత సాధించింది. భార్య మేయర్‌గా గెలుపొందగా... భర్త కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

భార్య మేయర్‌... భర్త కార్పొరేటర్‌

  • విజయనగరం కార్పొరేషన్‌లో దంపతుల విజయం

విజయనగరం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓ జంట అరుదైన ఘనత సాధించింది. భార్య మేయర్‌గా గెలుపొందగా... భర్త కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున కూటమి మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అవనాపు భార్గవి... మాజీ డిప్యూటీ స్పీకర్‌, వైసీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె కోలగట్ల శ్రావణిపై 18 వేల ఓట్లకుపైగా తేడాతో విజయం సాధించారు. ఆమె భర్త అవనాపు విజయ్‌ 14వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. భార్గవి విజయనగరం మునిసిపాలిటీ మాజీ చైర్మన్‌, దివంగత అవనాపు సూరిబాబు కోడలు. ఆయన కుమారుడు అవనాపు విజయ్‌ తొలుత కాంగ్రెస్, ఆ తరువాత వైసీపీలో కొనసాగారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరారు. టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజు గెలుపునకు కృషి చేశారు. ఈ నెల 23న జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఈ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 01:20 AM