శ్రీవారి ఆలయ ప్రాకారంపై రెండు తెలుగు శాసనాలుశ్రీవారి ఆలయ ప్రాకారంపై రెండు తెలుగు శాసనాలు
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:40 AM
తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారంపై రెండు కీలకమైన శాసనాలను పురావస్తు శాఖ గుర్తించింది. శ్రీకృష్ణదేవరాయలు తిరుమల తొలి యాత్ర, విరాళాల ప్రస్తావన ఇందులో కన్పిస్తున్నాయి.
శ్రీకృష్ణదేవరాయలు తొలి యాత్ర, దేవుడికి సమర్పించిన కానుకల వివరాలు నమోదు
తిరుమల, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారంపై రెండు కీలకమైన శాసనాలను పురావస్తు శాఖ గుర్తించింది. శ్రీకృష్ణదేవరాయలు తిరుమల తొలి యాత్ర, విరాళాల ప్రస్తావన ఇందులో కన్పిస్తున్నాయి. భారత్-శ్రీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే దాదాపు వంద శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. వాటిని భారత్-శ్రీ వెబ్సైట్లో ఆప్లోడ్ చేసేందుకు పురావస్తు శాఖ సిద్ధమైంది. ఆలయంలోని మొదటి ప్రాకారానికి ఉత్తరం వైపున్న గోడపై చెక్కిన రెండు శాసనాలు తెలుగు భాషలో ఉన్నాయి.
అవి 1513 ఫిబ్రవరి 10, గురువారానికి సంబంధించినవిగా ఏఎస్ఐ గుర్తించింది. ఈ రెండు శాసనాల్లో శ్రీకృష్ణదేవరాయల రాణులు చిన్నాజీ అమ్మ, తిరుమలమ్మ శ్రీవారికి సమర్పించిన బంగారు కానుకల వివరాలు నమోదయ్యాయి. రాత్రి పూజ అనంతరం తిరువేంగళనాథుడైన వేంకటేశ్వరస్వామికి పాలు సమర్పించేందుకు 374 తూకాల బరువున్న రెండు బంగారు గిన్నెలు, సుగంధ ద్రవ్యాలు ఉంచేందుకు 10 తూకాల బరువున్న బంగారు పళ్లేన్ని కానుకగా అందజేసినట్టు శాసనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు