ప్రయాణాలు వాయిదా వేసుకోండి
ABN , Publish Date - Oct 26 , 2026 | 04:47 AM
ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఆదివారం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదిలి, ఇది అండమాన్‌దీవుల్లోని శ్రీవిజయపురానికి 450, విశాఖపట్నానికి 820, కాకినాడకు 910, మచిలీపట్నానికి 1010, బాపట్లకు 1080కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక
అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఆదివారం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదిలి, ఇది అండమాన్‌దీవుల్లోని శ్రీవిజయపురానికి 450, విశాఖపట్నానికి 820, కాకినాడకు 910, మచిలీపట్నానికి 1010, బాపట్లకు 1080కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సోమవారం నుంచి వరుసగా తుఫాను, తీవ్ర తుఫాను, అతి తీవ్ర తుఫాను నేపథ్యంలో సహాయక చర్యల కోసం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిలాల్లో రెండు చొప్పున, శ్రీకాకుళం, అల్లూరి, అనకాపల్లి, పోలవరం, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఒక్కొక్క ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తుఫాన్ కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని, బోట్లు, వలలను జాగ్రత్త చేసుకోవాలని సూచించింది. తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రజలు మంగళ, బుధవారాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరింది. భారీ వర్షాల నేపథ్యంలో పొంగే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. కాగా, ఆదివారం చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. చిత్తూరు జిల్లా నగరిలో 3.95, తిరుపతి జిల్లా రెడ్లెపల్లెలో 3.46, నెల్లూరు జిల్లా మొలకలపూండ్లలో 3.14, చిత్తూరులో 3.12, తిరుపతి జిల్లా వేంపల్లిలో 3.07, వెంకటగిరిలో 2.97 సెంటీమీటర్ల వాన పడింది.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం