Share News

పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు.. స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ పూర్తి..

ABN , Publish Date - Mar 23 , 2026 | 05:19 PM

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు సోమవారం భూమి పూజ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.

పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు.. స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ పూర్తి..
Andhra Pradesh steel plant

అమరావతి, మార్చి 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు పడింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు సోమవారం భూమి పూజ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రులు కుమార స్వామి, శ్రీనివాస వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, టీజీ భరత్, అచ్చెన్నాయుడు, అనితతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ లక్ష్మీ నారాయణ మిట్టల్, ఏఎమ్ - ఎన్ఎస్ ఇండియా ఛైర్మన్ ఆదిత్య మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


కాగా, ప్రపంచ దిగ్గజ కంపెనీలైన ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పాన్‌ స్టీల్‌ కంపెనీలు ఈ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. 2,164 ఎకరాల్లో రెండు దశల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. తొలి దశలో 7.3 మిలియన్‌ టన్నులు, రెండో విడతగా 10.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనులు చేపడతారు. ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా బుచ్చిరాజుపేటలో 102.18 ఎకరాలు, చందనాడలో 840.2 ఎకరాలు, డీఎల్‌ పురంలో 674.39 ఎకరాలు, రాజయ్యపేటలో 36.62 ఎకరాలు, వేంపాడులో 510.92 ఎకరాలను ఈ ఉక్కు కర్మాగారానికి కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా 1.25 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనా.


ఇవి కూడా చదవండి

ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ తప్పులు చేయకండి

మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట క్యూనెట్ మోసం.. సంచలన విషయాలు వెలుగులోకి..

Updated Date - Mar 23 , 2026 | 05:40 PM