Share News

లైసెన్స్‌ సస్పెన్షన్‌లో ఉన్న డ్రైవర్లకు ప్రత్యామ్నాయ విధులు

ABN , Publish Date - Nov 27 , 2026 | 06:00 AM

రోడ్డు ప్రమాదాలలో వారి తప్పు లేదని తేలిన డ్రైవర్లకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ, వాటిని పునరుద్ధరించే వరకు ప్రత్యామ్నాయ విధులు కేటాయించి...

లైసెన్స్‌ సస్పెన్షన్‌లో ఉన్న డ్రైవర్లకు ప్రత్యామ్నాయ విధులు

  • జీతాల చెల్లింపునకు ఆర్టీసీ కీలక నిర్ణయం

విజయవాడ(బ్‌సస్టేషన్‌), నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలలో వారి తప్పు లేదని తేలిన డ్రైవర్లకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ, వాటిని పునరుద్ధరించే వరకు ప్రత్యామ్నాయ విధులు కేటాయించి, జీతాలు చెల్లించేందుకు ఏపీఏస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తాజాగా ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. సంస్థలోని ఈడీలు, డీపీటీవోలు, డిపో మేనేజర్లు, యూనిట్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ విన్నపం మేరకు ఆర్టీసీ ఈ చర్యలు తీసుకుంది. దీంతోపాటు అర్హులైన డ్రైవర్ల లైసెన్స్‌లను పునరుద్ధరించడానికి సంబంధిత డిపో మేనేజర్లకు, ఆర్టీవోలు, తదితరులకు లేఖలు రాసింది. ఆ లోపల ఆ డ్రైవర్లను సాధారణ విధులకు బదులు ఇతర విధులలో తాత్కాలికంగా నియమించాలని పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 06:04 AM