ఆర్టీసీ సేవలపై క్యూఆర్ కోడ్ ఫీడ్ బ్యాక్
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:01 AM
ప్రయాణికులకు ప్రజా రవాణా సేవల్లో ఎలాంటి అసౌకర్యం కలిగినా క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసే విధానాన్ని ఏపీఎస్ఆర్టీసీ అమల్లోకి తీసుకొచ్చింది.
అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రయాణికులకు ప్రజా రవాణా సేవల్లో ఎలాంటి అసౌకర్యం కలిగినా క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసే విధానాన్ని ఏపీఎస్ఆర్టీసీ అమల్లోకి తీసుకొచ్చింది. ఆర్టీసీ సిబ్బంది పనితీరు, బస్సుల సమయ పాలన, ఇతరత్రా సేవలపై సంతృప్తి చెందని ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎస్. బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. ప్రతి బస్టాండ్లోనూ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అతికించాలంటూ డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు