Share News

ఆర్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:56 AM

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి చేపట్టే ఆంధ్రప్రదేశ్‌ రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీఆర్‌సెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఆర్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి, తిరుపతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి చేపట్టే ఆంధ్రప్రదేశ్‌ రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీఆర్‌సెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని ఏపీఆర్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జాన్‌ సుష్మా తెలిపారు.

జనవరి 15 వరకు ఫైన్‌ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని, 16 నుంచి 21వ తేదీ వరకు రూ.2వేల ఫైన్‌తో దరఖాస్తుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో ప్రవేశ పరీక్షలు జరుగుతాయని వివరించారు.

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి హవా

Updated Date - Nov 20 , 2026 | 04:56 AM