ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దశాబ్దాలుగా కృషి
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:55 AM
ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి వివరించి, పరిష్కారానికి కృషి చేసిన ఏపీఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలపర్తి విద్యాసాగర్, డీవీ రమణకు రాష్ట్ర కార్యవర్గం అభినందనలు తెలిపింది.
ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్
విజయవాడ (గాంధీనగర్), సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి వివరించి, పరిష్కారానికి కృషి చేసిన ఏపీఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలపర్తి విద్యాసాగర్, డీవీ రమణకు రాష్ట్ర కార్యవర్గం అభినందనలు తెలిపింది. ఎన్జీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని ఎన్జీవో హోమ్‌లో ఆదివారం జరిగింది. ముఖ్యమంత్రితో సమావేశంలో చర్చించిన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని కార్యవర్గం అభిప్రాయపడింది.
విద్యాసాగర్ మాట్లాడుతూ 12 లక్షల మంది ఉద్యోగులకు బాధ్యత వహిస్తున్న ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్, ఏపీ జేఏసీ... ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో దశాబ్దాల తరబడి నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. డిమాండ్ల పరిష్కారంలో అహర్నిశలు కృషి చేస్తోందని వెల్లడించారు. డిసెంబరు 12న ఢిల్లీలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉద్యోగుల వేతన సవరణ, పీఎఫ్ఆర్‌డీఏ బిల్లు రద్దు, ఓపీఎస్ అమలు, దేశవ్యాప్తంగా కాంట్రాక్టు విధానంపై కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసే దిశగా ఒక పాలసీ తేవాలన్న డిమాండ్లతో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి..