Share News

అటవీకరణకు సముద్ర భూమి

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:27 AM

ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బ్రహ్మసమేధ్యం గ్రామంలో 1618 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎండీసీ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా గార నుంచి విశాఖపట్నం....

అటవీకరణకు సముద్ర భూమి

  • కోనసీమలో ఏపీఎండీసీకి 1618 ఎకరాల కేటాయింపు

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బ్రహ్మసమేధ్యం గ్రామంలో 1618 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎండీసీ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా గార నుంచి విశాఖపట్నం.. భీమిలి వరకు బీచ్‌శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌ చేస్తోంది. ఇందుకు బీచ్‌లు, దానిచుట్టుపక్కల ఉండే భూములను వినియోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో మైనింగ్‌ చేసే భూమి విలువకు ఇతర చోట్ల అటవీకరణ కోసం ఏపీఎండీసీ చూపించాలి. ఇటు గనులశాఖ, అటు ఏపీఎండీసీలు చేస్తున్న మైనింగ్‌ ప్రాజెక్టులకు రాష్ట్రంలో 12,500 హెక్టార్ల భూమిని అటవీకరణ చేయాల్సి ఉంది. ఈమేరకు బ్రహ్మసమేధ్యంలో 1618 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఎండీసీకి కేటాయిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు (604) జారీ చేసింది. ఇది సముద్ర భూమినే. ఇందులో కొంత మేర మడ అడవి కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ భూమికి ఏపీఎండీసీ నుంచి 60.68 కోట్ల ఫీజు వసూలు చేయనున్నారు. ఈ భూమిలో పూర్తిగా అటవీకరణే చేపట్టాలని, ఇతరులకు లీజుకివ్వడం చేయరాదని రెవెన్యూశాఖ స్పష్టం చేసింది.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 05:27 AM