జగన్ కుటుంబంపై జుగుప్సాకర వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:56 AM
పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ
అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమైన చర్య అని శనివారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాజకీయాల పేరుతో మహిళలను అవమానించడం, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం మంచిది కాదన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి చర్యలను మహిళా కమిషన్ సహించదన్నారు. సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం