ప్రతి జిల్లాకు టాస్క్‌ఫోర్స్ వాహనం
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:40 AM
రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణలో భాగంగా ప్రతి జిల్లాకు ఒక టాస్క్‌ఫోర్స్ వాహనం కొనుగోలు చేస్తున్నామని వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.
వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్
నెల్లూరు(సాంస్కృతికం), నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణలో భాగంగా ప్రతి జిల్లాకు ఒక టాస్క్‌ఫోర్స్ వాహనం కొనుగోలు చేస్తున్నామని వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నెల్లూరు హరనాథపురంలోని తన చాంబర్ వద్ద గురువారం తొలిగా ఐదు బొలేరో వాహనాలను ఆయన ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఆదేశాల మేరకు తెలుత 10 వాహనాలు కొనుగోలు చేశామని తెలిపారు. వక్ఫ్ భూముల సమాచారం తెలిపిన వెంటనే వాటిని పరిశీలనకు వెళ్లాలంటే సొంత వాహనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఈనేపథ్యంలో 10జిల్లాలకు 10 వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించామని అజీజ్ వెల్లడించారు. కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు సీఈవో అబ్దుల్‌ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా