Share News

గురిజేపల్లిలో ఓటు రేటు 20 వేలు!

ABN , Publish Date - Nov 28 , 2026 | 01:36 AM

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలంలోని గురిజేపల్లిలో ఓటు బాగా ‘కాస్ట్‌లీ’గా మారింది! ఓటు రేటు ఏకంగా రూ.20 వేలకు చేరింది!!

గురిజేపల్లిలో ఓటు రేటు 20 వేలు!

ఒక్కో కుటుంబానికి లక్ష వరకూ..

అద్దంకి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలంలోని గురిజేపల్లిలో ఓటు బాగా ‘కాస్ట్‌లీ’గా మారింది! ఓటు రేటు ఏకంగా రూ.20 వేలకు చేరింది!! గురిజేపల్లి పంచాయతీ ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయింది. 1220 మంది ఓటర్లు ఉన్నారు. ఎక్కువ మంది ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారే. గురిజేపల్లి పరిధిలో గ్రానైట్‌ క్వారీలు ఉండటంతో పంచాయతీ ఆదాయం కూడా ఎక్కువే.

అదేసమయంలో భూముల ధర ఎకరా రూ.కోట్లలో పలుకుతోంది. దీంతో ఓటు ధర కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. సర్పంచ్‌ పదవికి పోటీలో ఉన్న టీడీపీ, వైసీపీ మద్దతుదారులు పోటాపోటీగా ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికే తొలివిడత ఓటుకు రూ.20 వేల చొప్పున పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. ఆ విధంగా ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకూ ముట్టినట్లే! అయితే ఓటు రేటు రూ.25 వేలకు పెరిగినా అశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. కొన్ని కుటుంబాలకు ప్రత్యేకంగా ప్యాకేజీలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే అద్దంకి మండలంలోని ధేనువకొండలో విరుద్ధ పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ సార్వత్రిక ఎన్నికల్లో మినహా స్థానిక ఎన్నికల్లో ఓట్లకు డబ్బులు పంపిణీ చేయరు. హైదరాబాద్‌, తదితర ప్రాంతాల లో ఉండే ఓటర్లను తీసుకురావడానికి మాత్రం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం లేదా ఓటర్లకు చార్జీలకు సరిపడ డబ్బులు మాత్రం ఇస్తుంటారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 01:39 AM