పోలాసిగూడెం.. స్వచ్ఛంద ఏకగ్రీవం!
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:53 AM
కోటి, రెండు కోట్ల వరకు నిధులు ఇచ్చి ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరునంలో ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని పోలాసిగూడెం గ్రామస్థులంతా ...
ప్రభుత్వ ప్రోత్సాహకంపైనే ఆశ
కామవరపుకోట, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): కోటి, రెండు కోట్ల వరకు నిధులు ఇచ్చి ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరునంలో ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని పోలాసిగూడెం గ్రామస్థులంతా పార్టీలకు అతీతంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తూ తీర్మానించారు.
గ్రామంలో శనివారం రాత్రి ఈ మేరకు సమావేశమైన గ్రామస్థులు ఏకగ్రీవం చేయడంతో పంచాయతీకి వచ్చే నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగించేలా ఆమోదించారు. సర్పంచ్‌గా బిక్కిన వెంకట్రావును(టీడీపీ వర్గీయుడు), ఉప సర్పంచ్‌గా గాదె రామకృష్ణారెడ్డి (వైసీపీ వర్గీయుడు)ని ఎంపిక చేశారు. 8 వార్డులు ఉండగా రెండు వర్గాలకు చెరో 4 చొప్పున కేటాయించారు.
ఈ వార్తలనూ చదవండి:
సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు
ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!