Share News

నీటి సమస్యకు ‘ఏకగ్రీవం’గా చెక్‌!

ABN , Publish Date - Nov 28 , 2026 | 01:25 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరు జిల్లా కైకలూరు మండలం వేమవరప్పాడు గ్రామం వరుసగా మూడోసారీ ఏకగ్రీవమై ఆదర్శంగా నిలిచింది.

 నీటి సమస్యకు  ‘ఏకగ్రీవం’గా చెక్‌!

  • వరుసగా మూడోసారీ ఏకగ్రీవమైన ‘వేమవరప్పాడు’

  • ఎంపీటీసీ, పది వార్డులు కూడా ఏకగ్రీవ ఎన్నికనే

కైకలూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరు జిల్లా కైకలూరు మండలం వేమవరప్పాడు గ్రామం వరుసగా మూడోసారీ ఏకగ్రీవమై ఆదర్శంగా నిలిచింది. 5 దశాబ్దాల క్రితం నిత్యం వివాదాలతో పోలీసు రికార్డుల్లో అత్యంత సమస్యాత్మక గ్రామంగా ఉన్న ఈ ఊరు.. గ్రామస్థుల ఐక్యత తో ఆ జాబితా నుంచి తొలగిపోయింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గ్రా మాభివృద్ధే వారి లక్ష్యం.

ఈ క్రమంలో గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకుని, ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకుంటూ.. ఏళ్ల తరబడి ఉన్న నీటి సమస్యకు చెక్‌ చెప్పింది. 3400 మంది జనాభా ఉన్న వేమవరప్పాడులో ఒకప్పుడు నిత్యం ఏదో ఒక వివాదంతో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయేవారు. ఈ గొడవలకు స్వస్తి పలకాలని మాజీ సర్పంచ్‌ బోయిన శ్రీనివాసరావు ఏకగ్రీవాల దిశగా గ్రామాన్ని నడిపించేందుకు సంకల్పించారు. మరోవైపు గ్రామంలో వేసవిలో, వర్షాభావ పరిస్థితుల్లో నీరు లేక ప్రజలు ఊటబావులను ఆశ్రయించేవారు.


ఈ కష్టాలు తొలగాలంటే చెరువు విస్తీర్ణం పెంచాలని భావించిన గ్రామస్థులంతా ఏకతాటిపైకి వచ్చి పదవులను ఏకగ్రీవంగా తీర్మానించారు. టీడీపీ నుంచి సర్పంచ్‌గా బోయిన దేవిని రూ.30 లక్షలకు, బీజేపీ నుంచి ఎంపీటీసీ సభ్యురాలిగా బోయిన రిబ్కాను రూ.10 లక్షలకు, త్వరలో జరగనున్న పీఏసీఎస్‌ అధ్యక్ష పదవికి రూ.5 లక్షలకు ఏకగ్రీవం చేశారు.

ఇలా సమకూరిన రూ.45 లక్షలతో 73 సెంట్ల పంట భూమిని మంచినీటి చెరువు కోసం కొనుగోలు చేశారు. గత 3 పర్యాయాల్లో సమకూరిన సొమ్ముతో మంచినీటి చెరువు సరిహద్దున ఉన్న మరో 2.65 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, మొత్తం 5 ఎకరాల 40 సెంట్ల విస్తీర్ణంలో చెరువును ఏర్పాటు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 01:27 AM