పట్టణ సంస్థల్లో తొలి రోజు 273 నామినేషన్లు
ABN , Publish Date - Nov 15 , 2026 | 01:42 AM
రాష్ట్రంలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు శనివారం శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు...
అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు శనివారం శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు 5 నామినేషన్లు, 260 డివిజన్లకు గాను 98 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 19 మున్సిపాలిటీ/నగర పంచాయతీల చైర్‌పర్సన్ పోస్టులకు 10 నామినేషన్లు, 749 వార్డులకు 160 నామినేషన్లు (మొత్తం 273) దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు సోమవారం వరకు గడువుంది. శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస మున్సిపాలిటీలకు తొలిరోజు 12 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం