Share News

పొదిలిలో 77.90 శాతం పోలింగ్‌

ABN , Publish Date - Nov 28 , 2026 | 01:43 AM

రాష్ట్రంలోని 23 పట్టణ స్థానికసంస్థల పరిధిలో గురువారం జరిగిన ఎన్నికల్లో సగటున మొత్తం 63.44 శాతం పోలింగ్‌ నమోదైంది.

పొదిలిలో 77.90 శాతం పోలింగ్‌

  • అత్యల్పంగా శ్రీకాకుళంలో 54.67 శాతం..

  • 23 పట్టణ స్థానికసంస్థల్లో సగటు.. 63.44 శాతం

  • ఎస్‌ఈసీ వెల్లడి

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 23 పట్టణ స్థానికసంస్థల పరిధిలో గురువారం జరిగిన ఎన్నికల్లో సగటున మొత్తం 63.44 శాతం పోలింగ్‌ నమోదైంది. మార్కాపురం జిల్లాలోని పొదిలి మున్సిపాలిటీలో అత్యధికంగా 77.90 శాతం పోలింగ్‌ నమోదై అగ్రస్థానంలో నిలవగా, శ్రీకాకుళం మున్సిపాలిటీ అత్యల్పంగా 54.67 శాతం పోలింగ్‌తో చివరిస్థానంలో నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శుక్రవారం వివరాలను వెల్లడించింది. 23 పట్టణ స్థానికసంస్థల్లోని 1,009 వార్డుల్లో మొత్తం 15,85,031 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్‌ శాతంలో పొదిలి 77.90 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. కందుకూరు 76.67, ఆమదాలవలస 75.20, మంగళగిరి-తాడేపల్లి 74.65, బాపట్ల 70.78, బి.కొత్తకోట 70.32 శాతం పోలింగ్‌ నమోదు చేశాయి. మొత్తం ఆరు పట్టణ స్థానికసంస్థల్లో 70 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది. కాగా, 23 పట్టణ స్థానికసంస్థల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఈ నెల 30వ తేదీ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 01:46 AM