గిరిజన సంక్షేమశాఖ సర్వీస్ రూల్స్‌లో సవరణలు
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:02 AM
ఏపీ గిరిజన సంక్షేమశాఖ రాష్ట్ర సర్వీసురూల్స్-1999కు ప్రభుత్వం పలు కీలక సవరణలు చేసింది. ఈ సవరించిన నిబంధనలు జూలై 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. క్లాస్-ఎ కేటగిరీ-6లోని జిల్లా గిరిజన సంక్షేమాధికారి పోస్టులను రెండు మల్టీ జోన్ల పరిధిలోకి తీసుకొచ్చారు.
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఏపీ గిరిజన సంక్షేమశాఖ రాష్ట్ర సర్వీసురూల్స్-1999కు ప్రభుత్వం పలు కీలక సవరణలు చేసింది. ఈ సవరించిన నిబంధనలు జూలై 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. క్లాస్-ఎ కేటగిరీ-6లోని జిల్లా గిరిజన సంక్షేమాధికారి పోస్టులను రెండు మల్టీ జోన్ల పరిధిలోకి తీసుకొచ్చారు. మల్టీజోన్-1లో 1, 2, 3, మల్టీజోన్-2లో 4, 5, 6 ఉంటాయి. ఈ పోస్టుల్లో నియమించే అధికారం గిరిజన సంక్షేమ కమిషనర్/డైరెక్టర్‌కు ఉంటుంది. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్(క్లాస్-ఎ, కేటగిరి-7) పోస్టులకు నియామక యూనిట్లను 6 జోన్లగా నిర్ణయించారు.
క్లాస్-సి, కేటగిరి-2 లోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (ఏజెన్సీ) పోస్టులకు ప్రత్యక్ష నియామకం లేదా ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్ ప్రకారం హెడ్ మాస్టర్ గ్రేడ్-2(గెజిటెడ్)నుంచి పదోన్నతి ద్వారా నియామకం చేపట్టవచ్చు. వీటికి కూడా మల్టీజోన్-1, మల్టీజోన్-2 యూనిట్లను నిర్ణయించారు. ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు. గిరిజన సంక్షేమశాఖ సబార్డినేట్ సర్వీ్‌సరూల్స్-2011లోనూ ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఇందులో ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫరీ కేటగిరీని ఏర్పాటు చేశారు. ఈ పోస్టులను జిల్లా కేడర్‌గా గుర్తించి ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయనున్నారు. స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ